రక్త పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లి ఇంటికి తిరిగి వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగుడు బంగారు ఆభరణాన్ని అపహరించాడు. సికింద్రాబాద్ జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోహన్రావు నగర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. జనగామ జిల్లా బచ్చన్న పేటకు చెందిన సుజాత.. మోహన్ రావు నగర్లో తన కూతురు దగ్గరికి ఇటీవలే వచ్చారు.
ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్తున్న మహిళ మెడలో గొలుసు అపహరణ
హైదరాబాద్ నగరంలో చైన్ స్నాచింగ్లు కలకలం సృష్టిస్తున్నాయి. సికింద్రాబాద్లో ఇటీవల దొంగతనాలు ఎక్కువవడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లి తిరుగు పయనమైన మహిళ మెడలోంచి బంగారు ఆభరణాన్ని గుర్తు తెలియని దుండగుడు అపహరించాడు. జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దొంగతనం జరిగింది.
జవహర్ నగర్ పీఎస్ పరిధిలో చైన్ స్నాచింగ్
ఈరోజు మధ్యాహ్నం ఆస్పత్రికి వెళ్లి రక్త పరీక్షలు చేసుకున్న అనంతరం తిరిగి ఇంటికి వెళ్తుండగా.. బైక్పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి తన మెడలోని బంగారు గొలుసును అపహరించి పరారయ్యాడని బాధితురాలు తెలిపారు. అప్రమత్తమైన ఆమె వెంటనే జవహర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా నిందితుడిని గుర్తించేందుకు యత్నిస్తున్నారు.
ఇదీ చదవండి:ప్రేమించట్లేదని యువతిపై కత్తితో దాడి..