Chain Snatching: ఒంటరిగా వెళుతున్న మహిళ మెడలో నుంచి వెనుక నుంచి వచ్చిన దొంగ రెండున్నర తులాల బంగారు గొలుసు చోరీ చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో చోటుచేసుకుంది. స్థానిక పట్టణంలో నివాసముండే అనసూయ అనే మహిళ బీడీలు చుట్టుతూ జీవనోపాధి పొందుతోంది. ఎప్పటిలాగే ఈ రోజు చుట్టిన బీడీలను కోట ఆర్మూర్లో ఇచ్చేందుకు నడుచుకుంటూ వెళ్తోంది. ఒంటరిగా వెళ్తున్న ఆమెను గమనించిన దొంగ వెనక నుంచి వచ్చి.. మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లాడు.
Chain Snatching: ఒంటరిగా వెళుతున్న మహిళ మెడలో నుంచి గొలుసు చోరీ - ఆర్మూర్లో గొలుసు చోరీ
Chain Snatching: నిజామాబాద్ జిల్లాలో గొలుసు చోరీ జరిగింది. ఆర్మూర్కి చెందిన ఓ మహిళ బీడీలు ఇచ్చేందుకు కార్ఖానాకు వెళ్తుండగా.. వెనక నుంచి వచ్చిన దొంగ ఆమె మెడలో నుంచి రెండున్నర తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లాడు. చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీకెమెరాలో నమోదయ్యాయి.
Chain Snatching
ఘటన జరిగినప్పుడు ఒంటరిగా వెళ్తుండటంతో రక్షించాలంటూ కేకలు వేసినా లాభం లేకుండాపోయింది. చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీకెమెరాలో నమోదయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నారు. పట్టపగలే జరిగిన ఈ ఘటనలో స్థానికుల్లో భయాందోళనలు మొదలయ్యాయి.
ఇదీ చదవండి:ఖమ్మంలో 250 కిలోల గంజాయి పట్టివేత