మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బలపాలలో ఛైన్ స్నాచింగ్ చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యురాలు మొగిలిచర్ల ప్రమీల ఇంటి నుంచి వ్యవసాయ బావి వద్దకు రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తుంది. స్థానిక శివాలయం సమీపంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు... ఆమె మెడలోని 3 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు.
మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన దుండగులు - Chain snatching in kuravi mandal
నడుచుకుంటూ వెళుతున్న ఓ మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసును గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో చోటుచేసుకుంది.
బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన దుండగులు
ఊహించని ఈ ఘటనతో తేరుకున్న బాధితురాలు ఒక్కసారిగా కేకలు వేసింది. దీంతో స్థానికులు అక్కడకు చేరుకునే లోపే దొంగలు మహబూబాబాద్ వైపు పరారయ్యారు. జరిగిన ఘటనపై బాధితురాలు కురవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:మత్తు మందుల కేసులో నలుగురు ఎమ్మెల్యేలు