రాచకొండ కమిషనరేట్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలోని ప్రజలు.. వరుస దొంగతనాలతో భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా రేషన్ దుకాణం నుంచి తిరిగి వెళుతున్న సమయంలో స్కూటర్‌పై వచ్చిన దుండగులు.. లక్ష్మీ అనే మహిళ మెడ నుంచి బంగారు గొలుసును దోచుకెళ్లారు.
స్కూటర్‌పై వచ్చి గొలుసు లాక్కెళ్లిన దుండగులు - గొలుసు దొంగతనం వార్తలు
వెంకటేశ్వర కాలనీకి చెందిన లక్ష్మి.. రేషన్ దుకాణంకు వెళ్లి తిరిగి ఇంటికి వెళుతోంది. ఇంతలోనే ఒక్కసారిగా స్కూటర్‌పై వచ్చిన దుండగులు.. ఆ మహిళ మెడ నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లిపోయారు. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
chain snatching, javahar nagar news, hyderabad
వరుస దొంగతనాలతో జవహర్ నగర్లో రోడ్డుపై తిరగాలంటే మహిళలు భయపడుతున్నారు. ఈ మధ్య కాలంలో పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా ఆరు గొలుసు దొంగతనాలు జరిగాయని.. ఇప్పటి వరకు ఒక్క కేసునూ పోలీసులు ఛేదించలేదని బాధితురాలు ఆరోపించారు.
ఇదీ చూడండి:బ్లాక్‌లో రెమ్‌డెసివిర్ అమ్ముతున్న ముఠా అరెస్ట్