Chain snatchers in Rajendranagar: హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో మరోసారి చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. రాజేంద్రనగర్లోని ప్రేమావతిపేటలో వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న చంద్రకళ అనే మహిళ మెడలోంచి దుండగలు గొలుసు లాక్కెళ్లారు. బస్తీ దవాఖానాలో హెల్పర్ పనిచేస్తోన్న చంద్రకళ ఎప్పటిలానే నడుచుకుంటూ వెళ్తుంది.
రాజేంద్రనగర్లో మరోసారి చైన్ స్నాచింగ్.. సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు - వైరల్ వీడియోలు
Chain snatchers CC footage: హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో మరోసారి గొలుసు దొంగలు తన చేతి వాటం ప్రదర్శించారు. ప్రేమావతిపేటలో వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోంచి బంగారం గొలుసు లాకెళ్లారు. దీంతో బాధిత మహిళ కింది పడిపోగా ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదు కాగా.. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
![రాజేంద్రనగర్లో మరోసారి చైన్ స్నాచింగ్.. సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు Chain snatchers in Rajendranagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16814889-85-16814889-1667396545268.jpg)
Chain snatchers in Rajendranagar
ఇంతలో ద్విచక్రవాహనంపై నుంచి వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోంచి సుమారు మూడు తులాల బంగారు గొలుసు తెంచేశారు. దీంతో బాధిత మహిళ కింద పడిపోగా.. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీ కెమెరాలో నిక్షిప్తం అయ్యాయి. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
రాజేంద్రనగర్లో మరో సారి చైన్ స్నాచింగ్.. సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు
ఇవీ చదవండి: