సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సెంట్రింగ్ సామాగ్రి అపహరిస్తున్న ముఠాను అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.5లక్షల విలువైన వస్తువులతో పాటు సెల్‌ఫోన్లు, వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. జీడిమెట్ల ప్రాంతంలో నివాసం ఉంటున్న అర్జున్ సింగ్, కరణ్ సింగ్ అనే వ్యక్తులు సోదరులు.. వీరు వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారని పోలీసులు తెలిపారు. కరోనా నేపథ్యంలో ఉపాధి లేకపోవడంతో సెంట్రింగ్ వస్తువులను అపహరించడం మొదలు పెట్టారని వెల్లడించారు.
సెంట్రింగ్ సామాగ్రి అపహరించే ముఠా అరెస్ట్..! - తెలంగాణ వార్తలు
సెంట్రింగ్ సామాగ్రిని అపహరించే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనా నేపథ్యంలో ఉపాధి లేకపోవడంతో నిందితులు ఈ చోరీలకు పాల్పడినట్లు అల్వాల్ పోలీసులు పేర్కొన్నారు. వారి నుంచి సెంట్రింగ్ వస్తువులు, సెల్‌ఫోన్లు, వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
![సెంట్రింగ్ సామాగ్రి అపహరించే ముఠా అరెస్ట్..! centring theft accused arrest, alwal police, cyberabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11164466-thumbnail-3x2-theft---copy.jpg)
సెంట్రింగ్ వస్తువుల చోరీ, అల్వాల్ పోలీసులు, సైబరాబాద్ కమిషనరేట్
సెంట్రింగ్‌కు ఉపయోగించే వస్తువులు బాగుచేసే క్రమంలో వీరు చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అల్వాల్, మియాపూర్, దుండిగల్, జీడిమెట్ల ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు పోలీసులు వివరించారు.
ఇదీ చదవండి:యూట్యూబ్ చూస్తూ అబార్షన్లు