ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి.. అతని చరవాణి ఎత్తుకెళ్లిన వ్యక్తిని మధ్య మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రెండు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డికి చెందిన మహమ్మద్ అమీర్ అలీ(27) వృత్తి రీత్యా ట్రాలీ ఆటో డ్రైవర్. చిన్నతనం నుంచి చెడు అలవాట్లకు బానిసై 2019లో ఓ దొంగతనం కేసులో అరెస్ట్ అయి జైలు జీవితం గడిపాడు. జైలు నుంచి విడుదలయ్యాక జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి ట్రాలీ ఆటో డ్రైవర్‌గా పనిచేసేవాడు. జైలు జీవితం గడిపిన అతనిలో నేర ప్రవృత్తి మారలేదు.
కిడ్నాప్ చేసిన వ్యక్తి అరెస్ట్.. చరవాణులు స్వాధీనం
ఇదివరకే జైలుకెళ్లిన అతనిలో ఎలాంటి మార్పు రాలేదు. బయటికొచ్చి తన నేర ప్రవృత్తిని కొనసాగించాడు. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి.. చరవాణి ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనపై బాధితుని ఫిర్యాదుతో నిందితుడు అమీర్‌ను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రెండు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.
గత నెల 25న అతనికి వరుసకు సోదరుడు అయ్యే మహమూద్ హుస్సేన్‌తో కలిసి అసెంబ్లీ ఎదురుగా ఉండే హకా భవన్ సిగ్నల్స్ వద్ద ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి.. అతన్ని చితకబాది స్మార్ట్ ఫోన్ లాక్కున్నారు. తర్వాత అతన్ని షేక్ పేట్ నాల వద్ద విడిచిపెట్టి వెళ్లిపోయారు. బాధితుడు వెంటనే సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. పక్కా సమాచారంతో అమీర్ ఆచూకీ కనుగొన్న సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. నిందితున్న అదుపులోకి తీసుకుని రెండు చరవాణులు సీజ్ చేశారు. తదుపరి దర్యాప్తు కోసం సైఫాబాద్ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధ కిషన్ రావు తెలిపారు.