NIA Raids in Old City : భాగ్యనగరంలోని పాతబస్తీలో కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది. రాజస్థాన్‌కి చెందిన దర్జీ కన్హయ్య హత్య కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ సోదాలు చేసింది. హత్య కేసులో అరెస్ట్ అయిన ఓ నిందితుడి ఫోన్లో హైదరాబాద్‌లో ఉంటున్న బిహార్ వాసి మహమ్మద్ మొనవౌర్ హుస్సేన్ కాంటాక్ట్ నంబర్ ఉండటంతో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు.
దర్జీ కన్హయ్య హత్య కేసు.. పాతబస్తీలో ఎన్ఐఏ సోదాలు..
NIA Raids in Old City : హైదరాబాద్ పాతబస్తీలో కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) సోదాలు జరిపింది. దర్జీ కన్హయ్య హత్య కేసు దర్యాప్తులో భాగంగా ఈ తనిఖీలు చేపట్టింది. అరెస్టు అయిన ఓ నిందితుడి ఫోన్లో హైదరాబాద్‌లో ఉంటున్న బిహార్ వాసి నంబర్ ఉండటంతో ఎన్ఐఏ దాడులు చేసింది. దీనిపై ఇవాళ అధికారిక ప్రకటన చేసే అవకాశముంది.
NIA
మంగళవారం అతడిని అదుపులోకి తీసుకుని మాదాపూర్‌లోని ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు. బిహార్‌కి చెందిన మహమ్మద్ మొనవౌర్ హుస్సేన్... గత 15ఏళ్లుగా సంతోశ్ నగర్లో ఓ మదర్సా నడుపుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. నేడు సోదాలపై అధికారికంగా ఎన్ఐఏ అధికారులు ప్రకటన చేసే అవకాశం ఉంది.