తెలంగాణ

telangana

ETV Bharat / crime

CC VISUALS: మొబైల్​ స్టోర్​లో చోరీ.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు - cell phones robbery in samsung mobile store

సమయం అర్ధరాత్రి దాటింది. రోడ్డుపై వాహనాలు వెళ్తూనే ఉన్నాయి. అవేమీ పట్టించుకోలేదు.. ఆ ఏడుగురు. ఐదుగురు దొంగతనం పనిలో ఉంటే.. మిగతా ఇద్దరు బయట కాపలా. బెడ్​ షీట్లను పరదాలుగా పెట్టి మొబైల్​ దుకాణంలోకి ప్రవేశించారు. దొరికినకాడికి సెల్​ఫోన్లను దోచుకున్నారు. సికింద్రాబాద్​ కార్ఖానా పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగిన ఈ దొంగతనం దృశ్యాలు.. సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

CC VISUALS
మొబైల్​ స్టోర్​లో చోరీ

By

Published : Aug 28, 2021, 7:41 PM IST

సికింద్రాబాద్​ కార్ఖానా పోలీస్ స్టేషన్​ పరిధిలో నిన్న రాత్రి జరిగిన సెల్​ఫోన్ల దొంగతనం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రూ. 15 లక్షల విలువైన చరవాణీలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.

సీసీ విజువల్స్​

శుక్రవారం రాత్రి ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు స్టోర్​ తాళం తొలగించి లోపలికి ప్రవేశించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. పక్కా ప్రణాళికతో లోపలికి ప్రవేశించిన దుండగులు పెద్ద ఎత్తున మొబైల్​ ఫోన్లను ఎత్తుకెళ్లారు. దాదాపు రూ.15 లక్షల విలువైన చరవాణీలు చోరీకీ గురయ్యాయని చెప్పారు. ఈ ఉదయాన్నే మొబైల్ స్టోర్​కి వెళ్లిన యజమాని.. దొంగతనం జరిగిందన్న విషయాన్ని గమనించారు. వెంటనే కార్ఖానా పోలీసులను ఆశ్రయించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని.. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:మరోసారి సీసీఎస్‌ పోలీసుల కస్టడీకి కార్వీ ఛైర్మన్ పార్థసారథి

ABOUT THE AUTHOR

...view details