హైదరాబాద్ మలక్‌పేటకు చెందిన సయ్యద్, అన్సార్ గోరి ఇద్దరు బాల్య మిత్రులు. వారు పదో తరగతిలో తప్పి... జులాయిగా తిరుగుతూ.. చెడు అలవాట్లకు బానిసలయ్యారు. ఈ క్రమంలో వారికి అవసరమైన డబ్బు కోసం... వాహనాలపై వెళ్తున్న వారి నుంచి సెల్‌ఫోన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. వారి ఆచూకీపై అందిన విశ్వసనీయ సమాచారంతో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి విచారించారు.
బీ అలర్ట్.. నగరంలో సెల్‌ఫోన్ స్నాచర్స్ - Cell phone snatchers arrested in Malakpet
విలాసవంతగా బతకాలనే ఆలోచనతో... సులువుగా సంపాదించే పనికి పూనుకున్నారు ఇద్దరు యువకులు. సెల్‌ఫోన్ దొంగతనాలకు పాల్పడి టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కారు. అసలేం జరిగిందంటే...?
బీ అలర్ట్.. నగరంలో సెల్‌ఫోన్ స్నాచర్స్
వారి నుంచి చోరీ చేసిన శ్యామ్‌సంగ్ ఏఎస్10తో పాటు వారు వాడుతున్న హోండా డియో ద్విచక్రవాహనాన్ని, ఇద్దరికి చెందిన రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం వారిని సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు.
- ఇదీ చదవండి:సర్పంచ్ అభ్యర్థి భర్త అపహరణ.. ఆపై హత్య!