తెలంగాణ

telangana

ETV Bharat / crime

politicians arrested for playing poker: హైదరాబాద్​లో పేకాడుతూ పట్టుబడిన ప్రముఖులు - మేడ్చల్‌ జిల్లా వార్తలు

Celebrities playing poker
Celebrities playing poker

By

Published : Dec 19, 2021, 12:05 PM IST

Updated : Dec 19, 2021, 12:58 PM IST

12:01 December 19

జవహర్‌నగర్‌ పరిధిలో పేకాడుతూ పట్టుబడిన ప్రముఖులు

politicians arrested for playing poker: మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ పరిధిలో పేకాడుతూ పలువురు ప్రముఖులు అరెస్ట్​ అయ్యారు. వారిలో జవహర్‌నగర్‌ పరిధిలోని కార్పొరేటర్​లు ఉండడం సంచలనంగా మారింది. కీసరలోని ఓ రిసార్టులో పలువురు పేకాట ఆడుతున్నట్లు టాస్క్​ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు పోలీసుల బృందం దాడులు నిర్వహించి ఏడుగురిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.65 వేలు, 5 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టైన వారిలో జవహర్‌నగర్‌ పరిధి కార్పొరేటర్‌ మనోహర్‌ రెడ్డి, మూడో డివిజన్‌ కార్పొరేటర్‌ భర్త బల్లి శ్రీనివాస్‌, నాలుగో డివిజన్‌ కార్పొరేటర్‌ భర్త వెంకటేశ్‌ ఉన్నారు. వీరిని పోలీసులు కీసరలోని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఇదీ చదవండి:Father Suicide After Son's Death : కుమారుడి మృతి తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య

Last Updated : Dec 19, 2021, 12:58 PM IST

ABOUT THE AUTHOR

...view details