తెలంగాణ

telangana

ETV Bharat / crime

CCTV Footage: మితిమీరిన పోకిరీల ఆగడాలు.. వీధుల్లో చేరి వీరంగం - young men damaged the vehicles

Alvin Colony CCTV Footage: హైదరాబాద్​ జగద్గిరి గుట్ట పీఎస్​ పరిధిలో అర్ధరాత్రి పోకిరీల ఆగడాలు మితిమీరిపోయాయి. కొత్త సంవత్సరం జోష్​లో పూటుగా మద్యం సేవించిన కొందరు యువకులు.. వీధుల్లో వీరంగం సృష్టించారు. కార్లు, ఆటోల అద్దాలను ధ్వంసం చేయడంతో పాటు బైక్​పై వెళ్తున్న వారిని వెంబడించి హల్​చల్​ చేశారు.

Alvin Colony CCTV Footage:
మద్యం మత్తులో యువకుల వీరంగం

By

Published : Jan 2, 2022, 1:45 PM IST

Alvin Colony CCTV Footage: హైదరాబాద్‌ జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఆల్విన్ కాలనీ డివిజన్‌లో పోకిరీల చేష్టలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబరు 31 అర్ధరాత్రి వరకు సంబురాలు చేసుకున్న కొందరు యువకులు.. అనంతరం మద్యం మత్తులో వీధుల్లో తిరుగుతూ హల్‌చల్‌ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బైక్​లను వెంబడించి

ఇళ్ల ముందు నిలిపి ఉంచిన కార్లు, ఆటోల అద్దాలను పోకిరీలు ధ్వంసం చేశారు. ద్విచక్రవాహనాలనూ వదల్లేదు. రోడ్డుపై వెళ్తున్న వారిని వెంబడించి, అడ్డుకుని మరీ వారిపై దాడికి యత్నించారు. వాహనదారులతో వాగ్వాదానికి దిగారు. వీరి దుశ్చర్యలతో నాలుగు కార్లు, రెండు ఆటోలు ధ్వంసం అయ్యాయి. పోకిరీల ఆగడాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

వీధుల్లో అర్ధరాత్రి పోకిరీల వీరంగం

ఇదీ చదవండి:Cyber crime news : లాభాల పేరిట వల.. రెండు నెలల్లో రూ.300 కోట్ల మోసం

ABOUT THE AUTHOR

...view details