Chain robbers in Humayun Nagar: హైదరాబాద్లో గొలుసు దొంగలు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా రోడ్డుపై వెళ్లే ఒంటరి మహిళలను టార్గెట్ చేసి వారి మెడలో బంగారం లాక్కెళ్తున్నారు. తాజాగా హుమాయున్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో విజయనగర్ కాలనీ జీహెచ్ఎంసీ పార్కు దగ్గరలో రోజ్ మేరీ అనే మహిళ ఈ నెల 8వ తేదీన రోడ్డుపై కూరగాయలు తీసుకొని వెళ్తోంది.
వామ్మో గొలుసు దొంగ.. పట్టపగలే చోరీ.. సీసీ కెమెరాలో దృశ్యాలు - Chain thieves
Chain robbers in Humayun Nagar: హైదరాబాద్లో గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. రోడ్డుపై వెళ్లే ఒంటరి మహిళలను టార్గెట్ చేసి వారి మెడలో బంగారం లాక్కెళ్తున్నారు. తాజాగా హుమాయున్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ నెల 8వ తేదీన ఓ మహిళ మెడలోంచి బైక్పై వచ్చిన దుండగుడు గొలుసు లాక్కెళ్లాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదు కాగా అవి వైరల్ అయ్యాయి.
Chain robbers in Humayun Nagar
ఒంటరిగా వెళ్తున్న ఆ మహిళను గమనించిన దుండగుడు.. ద్విచక్రవాహనంతో వెంబడించి ఆమె మెడలో ఎనిమిది గ్రాముల బంగారం గొలుసు దొంగిలించాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న హుమాయున్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి.
ఇవీ చదవండి: