తెలంగాణ

telangana

ETV Bharat / crime

పగలు రెక్కీ.. రాత్రి లూటీ.. ఇద్దరు దొంగలు అరెస్ట్​.! - robbery at ccc naspur police station area news

తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను మంచిర్యాల జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

ccc naspur police station, thieves arrested
సీసీసీ నస్పూర్​ పోలీస్​ స్టేషన్​, దొంగలు అరెస్ట్​

By

Published : Mar 3, 2021, 4:52 PM IST

మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్​ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి దొంగలు పోలీసులు అరెస్టు చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన తరుణ్, దిలీప్..అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు విచారించగా గతంలో చేసిన దొంగతనాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుల వద్ద నుంచి 199 గ్రాముల బంగారు ఆభరణాలు, 31 తులాల వెండి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details