లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన కస్టమ్స్ అధికారులు - cbi raids in hyderabad
19:40 October 25
హైదరాబాద్: కస్టమ్స్ విభాగంపై సీబీఐ సోదాలు
హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లోని కస్టమ్స్ కార్యాలయంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. కస్టమ్స్‌లోని ప్రివెంటివ్ విభాగంలో పని చేస్తున్న సూపరింటెండెంట్, ఇన్‌స్పెక్టర్.. రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు వారిని పట్టుకున్నారు. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం మేరకు బంగారం స్మగ్లింగ్‌కు సంబంధించిన నిందితుడు ఒకరు.. నిబంధనల ప్రకారం కస్టమ్స్ కార్యాలయంలో హాజరు కాకుండా నిర్లక్ష్యం చేశారు. దీంతో అతనిని అరెస్టు చేస్తామని ఈ ప్రివెంటివ్ విభాగం అధికారులు హెచ్చరించారు. రూ.20 వేలు ఇస్తే అరెస్టు నుంచి తప్పిస్తామని ప్రివెంటివ్ విభాగం అధికారులు నిందితుడికి చెప్పారు. అనంతరం వారి మధ్య పదివేలకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఇదే విషయం నిందితుడు సీబీఐకి ఫిర్యాదు చేశాడు.
దీంతో ఇవాళ సాయంత్రం బషీర్‌బాగ్‌లోని జీఎస్టీ భవన్‌లోని కస్టమ్స్ ప్రివెంటివ్ విభాగంపై సీబీఐ అధికారులు దాడులు చేశారు. లంచం తీసుకుంటుండగా ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు అధికారులు డీల్ చేస్తున్న కేసులు.. వాటి వివరాలపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదీచూడండి:'రూ.లక్ష కాదు రూ.2 కోట్లు కడతా.. కానీ జడ్జి అలా అనడం...'