తెలంగాణ

telangana

ETV Bharat / crime

YS Viveka Murder Case: సునీల్​ యాదవ్​పై ప్రశ్నల వర్షం... లోతేటివాగులో ఆయుధాల అన్వేషణ

వైఎస్ వివేకా హత్యకేసులో దర్యాప్తును సీబీఐ (CBI) వేగవంతం చేసింది. ఈనెల 2న గోవాలో అరెస్టయిన సునీల్ యాదవ్‌ను అధికారులు కస్టడీకి తీసుకుని రెండో రోజు విచారిస్తున్నారు. మరోవైపు.. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో నలుగురు అనుమానితులను అధికారులు ప్రశ్నిస్తున్నారు.

YS Viveka Murder Case
YS Viveka Murder Case

By

Published : Aug 7, 2021, 2:02 PM IST

ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య కేసు (Viveka murder case) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. మాజీ మంత్రి వైఎస్​ వివేకా హత్య కేసులో (Viveka murder case) కీలక నిందితుడిగా ఉన్న సునీల్​ యాదవ్​ను సీబీఐ అధికారులు కడప నుంచి పులివెందులకు తీసుకెళ్లారు. పులివెందులలో సునీల్ సమక్షంలో తనిఖీలు నిర్వహించారు. వివేకా ఇంటి సమీపంలోని లోతేటివాగులో సీబీఐ అధికారుల ఆయుధాల అన్వేషిస్తున్నారు. రెండు మున్సిపల్‌ ట్యాంకర్లతో వాగులో నీటిని సీబీఐ బృందాలు తోడేయిస్తున్నారు. సునీల్‌ ఇచ్చిన సమాచారంతో వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాల కోసం సీబీఐ బృందం తనిఖీలు చేపట్టారు.

ఈనెల 2న గోవాలో అరెస్టైన సునీల్ యాదవ్‌ను అధికారులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. సునీల్‌ను 13 రోజులు కస్టడీకి ఇవ్వాలని పులివెందుల కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసినా...10 రోజులకు మాత్రమే అనుమతి లభించింది. కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం కస్టడీకి తీసుకొన్న సీబీఐ (cbi)… ఈ నెల 16 వరకు విచారించనుంది. శుక్రవారం జైలు ఆవరణలోని అతిథి గృహంలోనే సునీల్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు.. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో శనివారం నలుగురు అనుమానితులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. డ్రైవర్ దస్తగిరి సుంకేసుల గ్రామానికి చెందిన ఉమా శంకర్ రెడ్డి, పులివెందులకు చెందిన చెప్పుల దుకాణం యజమాని మున్నాను అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఉదయమే కడప రైల్వే స్టేషన్ మాస్టర్ మోహన్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారణ చేశారు. వారికున్న సమాచారం మేరకు స్టేషన్ మాస్టర్​ను వివరాల కోసం పిలిచినట్లు తెలుస్తోంది.

వివేకా హత్య కేసును (viveka murder case) సవాలుగా తీసుకున్న సీబీఐ అధికారులు విచారణలో దూకుడు పెంచారు. గత 62 రోజులుగా పలువురు అనుమానితులను విచారించారు. ఈ కేసులో అధికారులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. తాజాగా కీలక నిందితుడు సునీల్​ యాదవ్​ను అరెస్ట్​ చేశారు. 2019 మార్చి 15న వివేకా దారుణహత్యకు గురికాగా.. మార్చి 14 అర్ధరాత్రి పులివెందులలో అనుమానాస్పదంగా తిరిగిన పలు వాహనాల వివరాలను సేకరించి ఆ దిశగా విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details