తప్పుడు పత్రాలు, రికార్డులు సమర్పించి రుణాలు పొందారనే ఆరోపణపై హైదరాబాద్‌కు చెందిన అమెజాన్ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ పై సీబీఐ కేసు నమోదు చేసింది (CBI case against Amazon Enterprises). కాగితాలు రీసైక్లింగ్ చేసే వ్యాపారం పేరుతో రుణాలు పొంది ఎగవేసినట్లు సీబీఐకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (union bank of india) ఫిర్యాదు చేసింది. ఆ మొత్తాన్ని ఇతర అవసరాలకు మళ్లించారని పేర్కొంది.
CBI case against amazon : అమెజాన్ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై సీబీఐ కేసు.. ఎందుకంటే..!
రుణాల పేరిట బ్యాంకును మోసం చేశారన్న అభియోగంపై హైదరాబాద్‌కు చెందిన అమెజాన్ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ పై సీబీఐ కేసు నమోదు చేసింది (CBI case against Amazon Enterprises). కాగితాలు రీసైక్లింగ్ చేసే వ్యాపారం పేరుతో రుణాలు పొంది ఎగవేసినట్లు సీబీఐకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేసింది.
cbi
అమెజాన్ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ మన్నేపల్లి కమల్ నాథ్, డైరెక్టర్ కొండపల్లి రాధాకృష్ణ, యూబీఐ బ్యాంకు మేనేజరు గోవిందు, ప్యానెల్ న్యాయవాది ఎ.శ్రీనివాస్ ప్రసాద్, వాల్యూయర్ కటకం నరసింహాన్ని సీబీఐ... నిందితులుగా చేర్చింది. నిందితులందరూ కుమ్మక్కై మోసం చేసినట్లు అభియోగం.
ఇదీ చూడండి:Suicide Attempt at BJP office: భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. ఎందుకంటే..