దిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో అరెస్టు అయిన అభిషేక్ బోయిన్‌పల్లిని దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ హాజరుపరిచింది. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అభిషేక్‌ను సీబీఐ అరెస్టు చేసింది. అభిషేక్ బోయినపల్లిని ఐదు రోజుల రిమాండ్ ఇవ్వాలని కోరగా... సీబీఐ కోర్టు మూడు రోజుల రిమాండ్ ఇచ్చింది. అభిషేక్ బోయినపల్లిపై ఇండోస్పిరిట్ ఖాతాల నుంచి రూ.3.85 కోట్లు అభిషేక్ ఖాతాలో చేరాయని ఆరోపణలు వచ్చాయి. నగదు బదిలీపై అభిషేక్ ఎలాంటి పత్రాలు చూపించలేదని సీబీఐ ఆరోపించింది. 2-3 ఖాతాల ద్వారా అభిషేక్ ఖాతాలోకి నిధులు వచ్చాయని సీబీఐ పేర్కొంది. డబ్బును అభిషేక్ వివిధ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టి షేర్లు కొన్నారని సీబీఐ వెల్లడించింది.
Delhi liquor scam: అభిషేక్ బోయినపల్లికి 3రోజుల రిమాండ్.. ఇక నెక్ట్స్ వారే! - అభిషేక్ బోయినపల్లి అరెస్టు
09:07 October 10
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరొకరు అరెస్టు
ఇప్పటికే ఈ కేసులో ఓన్లీ మచ్ లౌడర్ సంస్థ మాజీ సీఈఓ విజయ్ నాయర్‌ను సీబీఐ అరెస్టు చేసింది. విజయ్ నాయర్ తర్వాత హైదరాబాద్‌కు చెందిన అభిషేక్ బోయినపల్లిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచింది. అయితే అభిషేక్ బోయిన్‌పల్లిని ఎక్కడ అరెస్టు చేశారు.. అనే విషయాలను సీబీఐ గోప్యంగా ఉంచింది. దిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ 15మందిని నిందితులుగా పేర్కొంటూ.. మరికొందరు అధికారులు, ప్రైవేటు వ్యక్తులు ఉన్నారని ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. అనంతరం పలు మార్లు దిల్లీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్ రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి వ్యక్తులను ప్రశ్నించింది. మరి కొందరిని దిల్లీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి విచారణ చేపట్టింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు, వారి అనుచరులు ఉన్నట్లు పేర్కొన్న సీబీఐ... ఇప్పుడు తాజాగా... ఎఫ్‌ఐఆర్‌లో అభిషేక్ బోయినపల్లిని అరెస్టు చేసినట్లు ప్రకటించింది.
మరోవైపు ఇదే వ్యవహారంపై... ఎన్‌ఫోర్సమెంట్ డైరక్టరేట్ కూడా దర్యాప్తును ముమ్మరం చేసింది. అరబిందో సంస్థ డైరక్టర్ పెనాక శరత్ చంద్రారెడ్డిని మూడు రోజుల పాటు ప్రశ్నించింది. ఆ తర్వాత ఇండో స్పిరిట్ గ్రూపునకు చెందిన సమీర్ మహేంద్రను ఈడీ అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచింది. న్యాయస్థానం అనుమతితో నాలుగు రోజుల కస్టడీకి తీసుకుంది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఈడీ... ఇప్పటికి నాలుగు సార్లు పలు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించడంతో పాటు... పలువురు వ్యక్తులను హైదరాబాద్, దిల్లీ, చెన్నై, బెంగళూరుల్లో ప్రశ్నించింది.
ఇవీ చూడండి: