తెలంగాణ

telangana

ETV Bharat / crime

‌ ఎస్సైనంటూ ఏపీ వ్యక్తిని మోసగించిన తెలంగాణ యువకుడు - సైబర్‌క్రైమ్‌ ఎస్సైనంటూ నగదు వసూలు

తెలంగాణకు చెందిన యువకుడు సైబర్‌ క్రైమ్‌ ఎస్సైనంటూ ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన రంగస్వామి అనే వ్యక్తిని మోసగించాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఏపీ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసులమని మాయమాటలు చెప్పి నగదు కాజేసే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

cash-collection-like-cybercrime-police
‌ ఎస్సైనంటూ ఏపీ వ్యక్తిని మోసగించిన తెలంగాణ యువకుడు

By

Published : Mar 7, 2021, 10:59 AM IST

ఏపీ యువకుడిని బెదిరించి నగదు కాజేసిన తెలంగాణ వ్యక్తిని ప్రకాశం జిల్లా మార్కాపురం పోలీసులు అరెస్టు చేశారు. పట్టణానికి చెందిన ఓ విద్యార్థి విజయవాడలోని ప్రైవేటు యూనివర్సిటీలో ఎంఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అంతర్జాలంలోని కాల్‌బాయ్స్‌ వెబ్‌సైట్‌లో తన పేరు నమోదు చేసుకున్నారు. అందులోని వివరాల ఆధారంగా ఆ విద్యార్థికి సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన బంకా నవీన్‌రెడ్డి ఫోన్‌ చేసి తాను సైబర్‌ క్రైమ్‌ ఎస్సైనంటూ పరిచయం చేసుకున్నాడు. వెబ్‌సైట్‌ ద్వారా అమ్మాయిలను మోసం చేయాలని చూస్తున్నావని బెదిరించాడు.

కేసు లేకుండా చేయాలంటే నగదు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. బాధితుడు విడతల వారీగా రూ.97,600 నగదు చెల్లించారు. మరో రూ.లక్ష ఇస్తేనే కేసు మాఫీ చేస్తానని, లేకుంటే పోలీసులు వచ్చి అరెస్టు చేస్తారని భయపెట్టడంతో అనుమానం వచ్చిన బాధితుడు గత నెల 26వ తేదీన మార్కాపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన అధికారుల సూచనలతో బాధితుడు నవీన్‌రెడ్డికి ఫోన్‌ చేసి మార్కాపురం వచ్చి నగదు తీసుకెళ్లాలని సూచించారు. ఒప్పందం మేరకు మార్కాపురం వచ్చిన నిందితుణ్ని ఎస్సై టి.కిశోర్‌బాబు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం అంగీకరించినట్టు డీఎస్పీ వివరించారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని తెలిపారు. పోలీసులమని మాయమాటలు చెప్పి నగదు కాజేసే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.

ఇదీ చూడండి:భర్తను హతమార్చి... సహజ మరణంగా నమ్మించి!

ABOUT THE AUTHOR

...view details