నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హుస్నాబాద్ సీఐ రఘుపతి రెడ్డి హెచ్చరించారు. అక్కన్నపేట మండలంలోని పలు ఎరువుల దుకాణాల్లో.. వ్యవసాయ అధికారులతో కలిసి ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గడువు ముగిసిన (Expired date) బయో ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్ను స్వాధీనం చేసుకున్నారు. దుకాణాదారులపై కేసులు నమోదు చేశారు.
Counterfeit seeds: నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై కేసులు - counterfeit seeds
రైతులు.. కొనుగోలుకు ముందు నాణ్యమైన విత్తనాలను గుర్తించాలని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సీఐ రఘుపతి రెడ్డి సూచించారు. గ్రామాల్లో తిరుగుతూ అమ్మే విడి విత్తనాలను కొనుగోలు చేయవద్దన్నారు. నకిలీ విత్తనాలను విక్రయించే వ్యాపారులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
రైతులు.. కొనుగోలుకు ముందు నాణ్యమైన విత్తనాలను గుర్తించాలని సీఐ సూచించారు. గ్రామాల్లో తిరుగుతూ అమ్మే విడి విత్తనాలను కొనుగోలు చేయవద్దన్నారు. నిబంధనలు అతిక్రమించిన వ్యాపారులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి, దుకాణాల లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. నకిలీ విత్తనాలను అమ్ముతున్నట్లు తెలిస్తే.. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ నెంబర్ 7901100100కు సమాచారం అందించాలని కోరారు.
ఇదీ చదవండి:Extramarital Affair: వివాహేతర సంబంధం పెట్టుకుందని భార్యను చంపిన భర్త