తెలంగాణ

telangana

ETV Bharat / crime

కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన పలువురు వాహనదారులపై కేసులు - telangana latest news

చిక్కడపల్లి పోలీస్​స్టేషన్ పరిధిలోని పలు ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్​, శాంతి భద్రతల పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన సుమారు 20 మంది వాహనదారులపై కేసు నమోదు చేశారు. అనవసరంగా రోడ్లపై తిరిగితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

cases
వాహనదారులకు జరిమానాలు

By

Published : May 10, 2021, 9:14 AM IST

కరోనా నియమాలను ఉల్లంఘించిన వ్యాపారస్థులు, వాహనదారులపై ట్రాఫిక్​, శాంతిభద్రతల పోలీసులు కొరఢా ఝుళిపించారు. ప్రధానంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలువురు వ్యాపారస్థులు కర్ఫ్యూ నియమాలను ఉల్లంఘించి యథేచ్ఛగా వ్యాపారం నిర్వహిస్తున్నారు. మద్యం దుకాణాల్లో సైతం కర్ఫ్యూ సమయంలో దుకాణం వెనక వైపున వాహనాల్లో మద్యం ఏర్పాటు చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్నారు.

మరోవైపు ఆర్టీసీ క్రాస్​రోడ్ మీదుగా రాకపోకలు సాగించే అనేక మంది ద్విచక్ర వాహనదారులు రోడ్లపై అనవసరంగా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, నంబర్ ప్లేట్లు సక్రమంగా లేకుండానే సంచరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్​స్టేషన్ పరిధిలోని పలు ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్​, శాంతి భద్రతల పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలను ఉల్లంఘించిన సుమారు 20 మంది వాహనదారులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కర్ఫ్యూ నియమాలను ఉల్లంఘించి.. అనవసరంగా రోడ్లపై తిరిగితే వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోక తప్పదని శాంతిభద్రతల పోలీసులు వాహనదారులను హెచ్చరించారు.

ఇదీ చదవండి:కేసీఆర్​కు ప్రధాని ఫోన్​.. సూచనలు బాగున్నాయని అభినందన

ABOUT THE AUTHOR

...view details