ముఖ్యమంత్రి కేసీఆర్ను కించపరిచేలా ఆయన ఫొటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారని... తెలంగాణ భవన్లో పనిచేసే ఆక్షయ్కుమార్ అనే వ్యక్తి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఫొటోలను మార్ఫింగ్ చేసింది ఎవరనే అంశంపై పోలీసులు లోతుగా ఆరాతీస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ ఫొటోలు మార్ఫింగ్.. వారిపై కేసు నమోదు - hyderabad latest news
సీఎం కేసీఆర్ ఫొటోలు మార్ఫింగ్ చేయడంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ముఖ్యమంత్రిని కించపరిచేలా ఆయన చిత్రాలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
సీఎం కేసీఆర్ ఫొటోలు మార్ఫింగ్