తెలంగాణ

telangana

ETV Bharat / crime

పవన్ కల్యాణ్ అభిమానులపై కేసు నమోదు.. ఎందుకంటే..?

Case registered against Pawan Kalyan fans: భీమ్లానాయక్ చిత్రం విడుదల రోజున ఓ థియేటర్ వద్ద జంతుబలి చేశారంటూ జంతు ప్రేమికుడు, న్యాయవాది అసర్.. పవన్ కల్యాణ్ అభిమానులపై ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. థియేటర్ ఆవరణలో బహిరంగంగా గొర్రెపిల్లను బలి ఇస్తున్న దృశ్యాలు సామాజిక మాద్యమాలలో వైరల్ అయ్యాయని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Case registered against Pawan Kalyan fans
Case registered against Pawan Kalyan fans

By

Published : Mar 7, 2022, 10:26 PM IST

police Case on Pawan Kalyan fans: ఏపీలోని చిత్తూరు జిల్లా పీలేరులో పవన్ కల్యాణ్ అభిమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. భీమ్లానాయక్ చిత్రం విడుదల రోజున ఓ థియేటర్ వద్ద జంతుబలి చేశారంటూ మహరాష్ట్రకు చెందిన జంతు ప్రేమికుడు, న్యాయవాది అసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిబ్రవరి 25న పీలేరు సీఎస్ఎన్ థియేటర్ ఆవరణలో బహిరంగంగా గొర్రెపిల్లను బలి ఇస్తున్న దృశ్యాలు సామాజిక మాద్యమాలలో వైరల్ అయ్యాయని న్యాయవాది అసర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మెయిల్‌ ద్వారా ఫిర్యాదు రావడంతో... పీలేరు పోలీసులు మహరాష్ట్రకు చెందిన న్యాయవాది అసర్​ను సంప్రదించి వివరాలు సేకరించారు.

ఫిర్యాదుతో పాటు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన దృశ్యాలను అసర్ అందచేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దృశ్యాల అధారంగా నిందితులను గుర్తించేందుకు చర్యలు ప్రారంభించారు. పవన్ కల్యాణ్ అభిమానులతో పాటు సీఎస్ఎన్ థియేటర్ యాజమాన్యంపైనా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:ap cabinet Meeting: ఏపీలో రెండో అధికార భాషగా ఉర్ధూ..!

ABOUT THE AUTHOR

...view details