తెలంగాణ

telangana

ETV Bharat / crime

బండి సంజయ్​పై తప్పుడు ప్రచారం!.. సైబర్​ పోలీసులకు భాజపా ఫిర్యాదు - తెలంగాణ నేరవార్తలు

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​పై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆ పార్టీ ఐటీ సెల్​ ఫిర్యాదు చేసింది. తెరాస సామాజిక మాధ్యమాల కన్వీనర్​పై చర్యలు తీసుకోవాలని సైబర్​ క్రైం పోలీసులను కోరినట్లు తెలిపింది.

bandi sanjay
బండి సంజయ్​పై తప్పుడు ప్రచారం!.. సైబర్​ క్రైంకు భాజపా ఫిర్యాదు

By

Published : Mar 13, 2021, 5:29 PM IST

తెరాస సామాజిక మాధ్యమాల కన్వీనర్​ క్రిశాంక్​పై భాజపా ఐటీ సెల్​ కన్వీనర్​ వెంకటరమణ ఫిర్యాదు చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​పై తప్పుడు ప్రచారం చేసినట్లు సైబర్​ క్రైం పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు.

సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబర్​ క్రైం పోలీసులు చెప్పారని.. వెంటరమణ తెలిపారు.

ఇవీచూడండి:టీఎస్​పీఎస్సీ పేరిట నకిలీ మెయిల్​..

ABOUT THE AUTHOR

...view details