తెలంగాణ

telangana

ETV Bharat / crime

Case filed on Mp : రాజ్యసభ ఎంపీపై కేసు నమోదు

రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్​పై వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్​లో కేసు నమోదయింది. అల్లూరి ట్రస్టు కార్యదర్శి, ట్రస్టీగా పని చేస్తున్న ప్రకాశ్​తో పాటు మరో ఇద్దరు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించగా.. న్యాయమూర్తి ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

రాజ్యసభ ఎంపీపై కేసు నమోదు
రాజ్యసభ ఎంపీపై కేసు నమోదు

By

Published : Jul 25, 2021, 10:28 AM IST

రాజ్యసభ ఎంపీ బండా ప్రకాశ్​పై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీస్ స్టేషన్​లో కేసు నమోదయింది. ఎంపీతో పాటు మరో ఇద్దరిపై ఈ నెల 23న పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లూరి ట్రస్టు కార్యదర్శి, ట్రస్టీగా పని చేస్తున్న బండా ప్రకాశ్‌తో పాటు ఎం. సత్యనారాయణ, ఎ. వంశీధర్‌లు 2016 నుంచి 2018 వరకు సుమారు 12.21 లక్షల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు.

ఇదీ చదవండి:Cyber Crime : ఒక్క ఫోన్​కాల్.. రూ.8 లక్షలు స్వాహా

కోర్టు అదేశాల మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సుబేదారి పోలీస్ స్టేషన్ సీఐ రాఘవేందర్‌ తెలిపారు. దీనిపై ఎంపీ బండా ప్రకాశ్‌ను వివరణ కోరగా...ట్రస్టుతో భాస్కర్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఆయన ట్రస్టు సభ్యుడు కాదని, ఆయన తండ్రి గతంలో సభ్యుడిగా పని చేశారని అన్నారు. తమ ట్రస్టులో లెక్కలన్నీ పారదర్శకంగా ఉన్నాయని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details