సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని కొవిడ్ నిబంధనలు పాటించని ఓ షాపింగ్ మాల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మాల్లో ఎస్సై వెంకటరెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. భౌతిక దూరం పాటించకుండా ఎక్కువ మందిని లోపలికి అనుమతించారని గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు మాల్ యజమానిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
మాల్లో కరోనా నిబంధనలు బేఖాతరు.. కేసు నమోదు - తెలంగాణ వార్తలు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ఓ షాపింగ్ మాల్లో నిబంధనలను గాలికొదిలేశారు. భౌతిక దూరం పాటించకుండా ఎక్కువ మందిని లోపలికి అనుమతించారు. మాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఎస్సై... యజమానిపై కేసు నమోదు చేశారు.
![మాల్లో కరోనా నిబంధనలు బేఖాతరు.. కేసు నమోదు case file on shopping mall, no corona rules in shopping mall](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-04:29:33:1619953173-tg-srd-36-02-shoping-maall-kesu-ts10055jpg-02052021162320-0205f-1619952800-1068.jpg)
షాపింగ్ మాల్‌పై కేసు నమోదు, షాపింగ్ మాల్లో కరోనా నిబంధనల ఉల్లంఘన
రోజూ అన్ని దుకాణాలు, హోటళ్లలో తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:'వారికి టీకాలు వేయాలంటే.. 122కోట్ల డోసులు అవసరం '