తెలంగాణ

telangana

By

Published : Jun 23, 2021, 11:40 AM IST

ETV Bharat / crime

భూ వివాదంలో వ్యక్తి మృతి.. నల్గొండ జడ్పీ వైస్ ఛైర్మన్​పై కేసు

భూమిని ఆక్రమించుకుని అధికారంతో కేసులు పెట్టడం వల్ల మనస్తాపం చెంది తన భర్త గుండెపోటుతో మృతి చెందాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ ఘటన నల్గొండ జిల్లా యాచారం గ్రామంలో చోటు చేసుకుంది.

case-against-nalgonda-zp-vice-chairman-in-land-dispute
భూ వివాదంలో వ్యక్తి మృతి.. నల్గొండ జడ్పీ వైస్ ఛైర్మన్​పై కేసు

నల్గొండ జిల్లా అనుముల మండలం యాచారం గ్రామంలో సర్వే నెంబర్​ 690లో ఉన్న 30 గుంటల వ్యవసాయ భూమి వివాదంలో గొడవ పడుతూ.. ఆందోళనకు గురై సింగారపు అంజయ్య గుండె పోటుతో మృతి చెందాడు. నల్గొండ జడ్పీ వైస్ ఛైర్మన్ ఇరిగి పెద్దులే దీనికి కారణమంటూ అజయ్య కుటుంబసభ్యులు ఆరోపించారు.

అనుముల మండలం యాచారంలో జడ్పీ వైస్​ ఛైర్మన్(Nalgonda ZP Vice Chairman) ఇరిగి పెద్దులుకు సర్వే నెంబరు 690లో భూమి ఉంది. భూమి హద్దురాళ్లు తొలగించారని ఆ గ్రామానికి చెందిన సింగారపు అంజయ్య, శంకరయ్య, రాజేశేఖర్​లపై ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం పోలీసులువిచారణ కోసం భూమి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో సింగారపు అంజయ్యకు గుండెపోటు వచ్చింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు నల్గొండకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. పెద్దులు ఒత్తిడి వల్లనే తన భర్త చనిపోయాడని అంజయ్య భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హాలియా ఎస్సై శివకుమార్ తెలిపారు.

ఇదీ చూడండి:MURDER ATTEMPT: తల్లికి చేబదులు ఇవ్వలేదని.. యువకుల క్రూరత్వం!

ABOUT THE AUTHOR

...view details