శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మురుగునీటి పైప్లైన్ శుభ్రం చేస్తున్న ఘటనలో వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటనపై ఫేబర్ సింధూరీ పెసిలిటీస్ మేనేజ్మెంట్ సర్వీసెస్ సంస్థపై శంషాబాద్ పోలీసులు కేసును నమోదు చేశారు. సంస్థ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. విమానాశ్రయంలో ప్రయాణికులు దిగే ప్రాంగణంలో మురికి నీటి పైప్లైన్ లీకేజీ ఏర్పడింది. నిన్న సాయంత్రం నర్సింహ్మారెడ్డి అనే కార్మికుడు పైపులు మరమ్మతు చేసేందుకు ప్రయత్నించాడు. పైపుల్లో ఉన్న అడ్డంకిని తొలగించేందుకు యాసిడ్ పోశాడు. ఒక్కసారిగా యాసిడ్ ఘాటు వల్ల నరసింహ్మారెడ్డి అక్కడిక్కడే స్పృహ తప్పి పడిపోయాడు.
Shamshabad Airport: వ్యక్తి మృతిపై ఫేబర్ సింధూరీ సంస్థపై కేసు
శంషాబాద్ ఎయిర్పోర్టులో డ్రైనేజీ పైప్లైన్ లీకేజీ ఘటన ఒకరిని పొట్టనబెట్టుకుంది. ఈ ఘటనపై ఫేబర్ సింధూరీ పెసిలిటీస్ మేనేజ్మెంట్ సర్వీసెస్ సంస్థపై శంషాబాద్ పోలీసులు కేసును నమోదు చేశారు.
నరసింహ్మారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించిన జకీర్, ఇలియాస్లు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నరసింహ్మారెడ్డిని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పనిచేసే సమయంలో ఫేబర్ సింధూరి పెసిలిటీస్ సర్వీసెస్ సంస్థ.. సిబ్బంది భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
shamshabad: ఎయిర్పోర్టులో డ్రైనేజీ పైప్లైన్ బాగుచేస్తూ ఒకరు మృతి