వాగులో కారు గల్లంతు .. బారికేడ్లను తోసుకుని మరీ ప్రవాహంలోకి... - జగిత్యాలలో వాగులో కారు గల్లంతు
19:52 July 22
వాగు దాటే ప్రయత్నంలో ప్రవాహంలో కొట్టుకుపోయిన కారు
ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా (heavy rains) విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపిలేని వానలకు వాగులు, వంకలు పొంగుతుండగా... లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలుచోట్ల.. వాగులు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. కుండపోత వర్షాలకు.... జగిత్యాల మండలంలోని వాగులో కారు (car) గల్లంతైంది. వాగు దాటే ప్రయత్నంలో కారు ప్రవాహంలో కొట్టుకుపోయింది.
మంచిర్యాల జిల్లాకు చెందిన ముగ్గురు వేములవాడ దైవ దర్శనం చేసుకుని ఇంటికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. గల్లంతైన సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు కారులోంచి బయటకు వచ్చి ఓ చెట్టును పట్టుకుని సాయం కోసం ఎదురుచూశారు. కారులోని మరో వ్యక్తి గల్లంతయ్యారు. కొంత సమయం తర్వాత ముగ్గురూ ఈదుకుంటూ.. సురక్షితంగా ఒడ్డుకు చేరారు. జగిత్యాల మండలం అనంతారం వంతెనపై ఉద్ధృతంగా వరద పొటెత్తుతోంది. పోలీసులు పెట్టిన బారికేడ్లను సైతం తోసుకుని కారు వాగులోకి వెళ్లింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
సంబంధిత కథనాలు: