హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఓ మందుల దుకాణం ముందు నిలిపి ఉంచిన కారు దొంగతనానికి గురయింది. శ్రీ హర్ష అనే విశ్రాంత ఐఏఎస్ అధికారి కుమారుడు ఔషధాలు తీసుకురావడానికి వెళ్లి మందుల దుకాణం ముందు కారును నిలిపాడు. తాళం చెవిని కారుకే వదిలేసి దుకాణంలోకి వెళ్లాడు.
దుకాణంలోకి వెళ్లి వచ్చేలోపే కారు మాయం - బంజారాహిల్స్ కారు దొంగతనం
మందుల దుకాణంలోకి వెళ్లి ఔషధాలు తీసుకుని బయటకు వచ్చేలోపు కారు మాయమైంది. ఈ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్లో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
![దుకాణంలోకి వెళ్లి వచ్చేలోపే కారు మాయం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-img-20210509-wa0020-0905newsroom-1620568646-907.jpg)
car theft news, banjara hills, hyderabad
ఇది గమనించిన ఓ గుర్తు తెలియని దుండగుడు కారు స్టార్ట్ చేసుకుని ఉడాయించాడు. బాధితుడు దుకాణం నుంచి బయటకు వచ్చే సరికి కారు కనిపించకపోవడం వల్ల స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. కారు కోసం గాలిస్తున్నారు.
ఇదీ చూడండి: విషాదం: ఒకేరోజు తండ్రి తనయుల మృతి