CAR into ATM: కారుకు పూజ చేసి రోడ్డెక్కబోయిన ఓ కారు యజమాని.. అదుపుతప్పి ఏటీఎం సెంటర్లోకి దూసుకెళ్లాడు. ఏపీలోని విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం చిప్పాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. సిటీనగర్లోని చర్చి వద్ద పూజా కార్యక్రమాలు పూర్తైన అనంతరం కారును నడిపే క్రమంలో.. అదుపు తప్పి పక్కనే ఉన్న ఏటీఎం సెంటర్లోకి దూసుకుపోయింది.
Car into ATM: కొత్త కారు కొన్నాడు.. ఏటీఎంలోకి దూసుకెళ్లాడు..! - crime news in ap
CAR into ATM: ఓ వ్యక్తి కారు కొన్నాడు... ఇక పూజ చేసి కారు స్టార్ట్ చేశాడు... నెమ్మదిగా బయల్దేరాడు.. కొత్త కారులో వెళ్తున్నామన్న ఆనందమో.. టెన్షనో తెలియదు.. అంతే కారు ఒక్కసారిగా పక్కనే ఉన్న ఏటీఎంలోకి దూసుకెళ్లింది.. అదృష్టవశాత్తూ ఏటీఎంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన విశాఖలో జరిగింది.
Car into ATM
ఆ సమయంలో ఏటీఎంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కారు అద్దాలు ధ్వంసం కావడంతో పాటు.. ఏటీఎం డోర్ కూడా ధ్వంసమైంది. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై భీమునిపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: