తెలంగాణ

telangana

ETV Bharat / crime

Himayat Sagar Accident: లారీని ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు - హిమాయత్​సాగర్ రోడ్డు ప్రమాదం

Himayat Sagar Accident Today : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న కారు.. హిమాయత్​సాగర్​ వద్ద ఔటర్ రింగ్​రోడ్​పై ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మద్యం మత్తులో వాహనం నడపడం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.

Himayat Sagar Accident
Himayat Sagar Accident

By

Published : Dec 28, 2021, 8:47 AM IST

Himayat Sagar Accident Today : రంగారెడ్డి జిల్లా హిమాయత్‌సాగర్ వద్ద ఔటర్ రింగ్‌రోడ్‌పై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. శంషాబాద్‌ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న కారు.. ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో యువతి సహా.. ఐదుగురు యువకులున్నారు.

Car Hits Lorry at Himayat Sagar : ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కారులో ఇరుక్కుపోయిన యువతిని బయటికి తీశారు. అనంతరం, క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కారులో నుంచి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం తాగి వాహనం నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details