Car Fire In Nellore District:ఏపీలోని నెల్లూరు నగరం పొదలకూరు రోడ్డు సెంటర్లో ఓ కారు క్షణాల్లో కాలి బూడిదైంది. పద్మావతి సెంటర్లోని ఓ మద్యం దుకాణం ముందు ఉన్న కారుపై ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో భారీ ఎత్తున మంటలు చేలరేగాయి.
ఉవ్వెత్తున ఎగసిపడ్డ మంటలతో ఆ మార్గంలో వెళ్తున్న ప్రయాణీకులు బెంబేలెత్తారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అర్పేశారు. కారులో ఎవరూ లేకపోవటంతో ప్రాణ నష్టం తప్పింది.