హైదరాబాద్లోని తార్నాక మెట్రో స్టేషన్ వద్ద.. ఓ కారులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. అగ్ని దాటికి వాహనం పూర్తిగా దగ్ధమవ్వగా.. రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
నడిరోడ్డుపై కారులో మంటలు.. భారీగా ట్రాఫిక్ జామ్..! - కారు అగ్ని ప్రమాదం
హైదరాబాద్లోని తార్నాక మెట్రో స్టేషన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నడి రోడ్డుపై.. ఓ కారు మంటల్లో కాలి, పూర్తిగా దగ్ధమైంది.
మంటల్లో కారు దగ్ధం
అప్రమత్తమైన ప్రయాణికులు.. సకాలంలో కారు దిగిపోవడం వల్ల సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. పోలీసులు.. రహదారిపై నిలిచిపోయిన వాహనాలను క్లియర్ చేశారు.
ఇదీ చదవండి:అసద్ది ప్రతీకార హత్యే: పోలీసులు
Last Updated : Apr 2, 2021, 4:30 PM IST