పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. కుటుంబం మృతి - మదనపల్లె కారు ప్రమాదంలో కుటుంబం మృతి
07:56 May 26
అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం
Madanapalle Road Accident : ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె గ్రామీణం పరిధిలోని పుంగనూరు రోడ్డులో కారు కల్వర్టును ఢీకొట్టి ఆపై కిందపడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పుంగనూరు రోడ్డులోని 150 మైలు వద్ద ఈ ప్రమాదం జరిగింది.
ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతులను ఒకే కుటుంబానికి చెందిన వారని.. వారిలో దంపతులతో సహా ఇద్దరు పిల్లలున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులు నిమ్మనపల్లె మండలం రెడ్డివారిపల్లె వాసులు గంగిరెడ్డి, మధులత, కుషితారెడ్డి, దేవాన్ష్‌రెడ్డిలుగా గుర్తించారు. పలమనేరులో పెళ్లి కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఘటన జరిగినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.