Adilabad Road Accident : ఆదిలాబాద్ జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యవాత పడగా.. ఒకరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ దుర్ఘటన గుడిహత్నూర్ మండలం, సీతాగొంది వద్ద చోటుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు కారులో వెళ్తున్నారు. గుడిహట్నూర్ మండలం సీతాగొంది సమీపంలో ఆదిలాబాద్ వైపు వెళుతున్న కంటైనర్‌ను వెనుక నుంచి వస్తున్న కారు వేగంగా ఢీ కొట్టింది.
Adilabad Road Accident : కంటైనర్‌ని ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి - Adilabad Road Accident today
Adilabad Road Accident : రోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. ఒకే ప్రమాదంలో కుటుంబం మొత్తం మరణిస్తే ఇక ఆ విషాదానికి అంతే లేదు. తాజాగా ఆదిలాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం ఈ కోవకు చెందిందే. కంటైనర్‌ను కారు ఢీకొట్టిన ఘటనలో ఓ కుటుంబంలోని నలుగురు మృతి చెందారు.

రోడ్డు ప్రమాదం
ఈ ప్రమాదంలో ముగ్గురు పురుషులు, ఓ మహిళ మృతి చెందగా.. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. లారీ వెనుక ఇరుక్కుపోయిన మృతదేహాలను రెండు క్రేన్‌ల సాయంతో బయటకు తీశారు. మృతుల్లో డ్రైవర్ శంశు, సయ్యద్ రఫీతుల హస్మి, వజహబ్ హస్మి, సలీమా, జూబియాలు ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.