LB Nagar Car Accident : హైదరాబాద్‌లోని ఎల్బీనగర్లో శనివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీస్ స్టేషన్ ఎదురుగా కారు అతివేగంతో అండర్ పాస్‌లో డివైడర్ని ఢీకొట్టి బోల్తా పడింది. కాగా ఆ కారుపై రూ.13,350 పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్నట్లు, ఆ చలాన్లలో అన్నీకూడా ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్‌కు సంబంధించినవే ఉన్నాయని పోలీసులు గుర్తించారు.
LB Nagar Car Accident : కారు బీభత్సం.. రూ.13,350 పెండింగ్ చలాన్లు! - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్
LB Nagar Car Accident : ఎల్బీనగర్లో కారు బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రివేళ డివైడర్‌ను ఢీకొట్టిన కారు బోల్తా పడింది. కాగా ఆ కారుపై ఇప్పటికే రూ.13,350 పెండింగ్ చలాన్లు ఉండడం గమనార్హం.
కారు బీభత్సం
Car Bolta At LB Nagar :ప్రమాదం జరిగిన తర్వాత కారు వదిలి డ్రైవర్ పరారీ అయ్యాడు. మద్యం మత్తులోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండి :NRIs Help to Villages : పల్లె ప్రగతికి ప్రవాస హారతి.. స్వగ్రామాలకు ఎన్‌ఆర్‌ఐల సొబగులు