తెలంగాణ

telangana

ETV Bharat / crime

రిపేర్ చేయించుకొని వెళ్తున్న కారులో మంటలు, పూర్తిగా దగ్ధం - car fire accident

car burn on the national highway 65వ నెంబర్ జాతీయ రహదారిపై కారులో మంటలు కాసేపు కలకలం సృష్టించాయి. వెళ్తున్న కారులో మంటలు రావడం, జంక్షన్ ప్రాంతం కావడంతో కాసేపు ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

కారులో మంటలు, పూర్తిగా దగ్ధం
కారులో మంటలు, పూర్తిగా దగ్ధం

By

Published : Sep 1, 2022, 9:34 PM IST

car burn on the national highway: మెకానిక్​ షాపులో అప్పుడే రిపేరింగ్ చేయించుకొని ఇంటికి వెళ్తున్న ఓ కారు అగ్నిప్రమాదానికి గురైంది. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డి గూడెం మండలం కాసర్ల పహాడ్ గ్రామానికి చెందిన అరుణ్ తన కారు ఏపీ 15 ఏఎల్ 2149 నంబర్ ఇండిగో కారు స్వల్ప మరమ్మతుల కోసం సుర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం క్రాస్ రోడ్డు సమీపంలో ఉన్న ఓ మెకానిక్ వద్దకు తీసుకొచ్చారు. మరమ్మతుల అనంతరం కారులో 65వ నంబర్ జాతీయ రహదారి మీదుగా వెళ్తుండగా కొత్త మార్కెట్ రోడ్ జంక్షన్ వద్ద కారులో ఇంజిన్​లో పొగను గుర్తించారు.

ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ బ్యాటరీ నుంచి వచ్చే వైర్లను తొలగించారు. బ్యాటరీ తొలగించిన కాసేపటికే మంటలు అంటుకున్నాయి. ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. కారు యజమాని సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. జాతీయ రహదారి కావడంతో కాసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

రిపేర్ చేయించుకొని వెళ్తున్న కారులో మంటలు, పూర్తిగా దగ్ధం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details