భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం సూరారం సమీపంలో అదుపు తప్పి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో శివ అనే బాలుడు మృతి చెందగా.. మరో ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి.
సూరారం గ్రామంలో ఓ శుభకార్యానికి వెళ్లిన బాణోత్ వినోద్.. కారులో తన ఇద్దరు పిల్లలతో పాటు మేనల్లుడు శివను తీసుకొని ఏన్కూరు మండలం నాచారం బయలుదేరాడు. కొద్ది నిమిషాల్లోనే వారిని ప్రమాదం వెంటాడింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు.