ACCIDENT: తిరుమల కనుమదారిలో రోడ్డు ప్రమాదం.. మెదక్ జిల్లా వాసి మృతి - తిరుమలలో కారు ప్రమాదం
16:31 September 11
ACCIDENT: తిరుమల కనుమదారిలో రోడ్డు ప్రమాదం.. మెదక్ జిల్లా వాసి మృతి
తిరుమల కనుమదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మెదక్ జిల్లాకు చెందిన ముగ్గురు భక్తులు శ్రీవారిని దర్శించుకుని తిరుగు పయనమయ్యారు. తిరుమల కొండ పైనుంచి కిందకు దిగుతున్న సమయంలో మూడో కిలోమీటరు రాయి వద్ద కారు అదుపు తప్పి పిట్టగోడను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందు సీటులో ఉన్న శివలింగం గౌడ్ అనే వ్యక్తి మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి:Jyotiraditya Scindia : డ్రోన్ టెక్నాలజీ చరిత్రలోనే ఓ సంచలనం: కేంద్ర మంత్రి సింధియా