దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ఘాట్‌రోడ్డులో అదుపుతప్పిన కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా.. నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా మన్యంకొండ ఘాట్‌రోడ్డులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రుడు శ్రీనివాస్‌రెడ్డిని జిల్లాకేంద్రంలోని ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు.
అదుపుతప్పి కారు బోల్తా.. ఒకరి పరిస్థితి విషమం - కారు బోల్తా పడిన ఘటనలో ఐదుగురికి గాయాలు
కారు ఆదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మహబూబ్‌నగర్ జిల్లా మన్యంకొండ ఘాట్రోడ్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఘాట్‌రోడ్డులో అదుపుతప్పి కారు బోల్తా
హైదరాబాద్‌కు చెందిన కుటుంబం దైవ దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఘాట్‌రోడ్డులో కారు కిందకు దిగుతుండగా మలుపు వద్దకు రాగానే అదుపుతప్పి గోడను ఢీకొట్టి కింద పడింది.