కాలువలోకి దూసుకెళ్లిన కారు... ముగ్గురు దుర్మరణం - accident updates
![కాలువలోకి దూసుకెళ్లిన కారు... ముగ్గురు దుర్మరణం accident in east godavari](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10974036-841-10974036-1615515620542.jpg)
07:45 March 12
కాలువలోకి దూసుకెళ్లిన కారు... ముగ్గురు దుర్మరణం
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్ద.. కారు కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో.. ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వాసులు.. ఆత్రేయపురం మండలం వసంతవాడ తీర్థానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
తీర్థం నుంచి తిరిగి వస్తుండగా.. లొల్లలాకుల వద్ద కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఒకరి మృతదేహం లభ్యం కాగా.. మిగిలిన మృతదేహాల కోసం గాలిస్తున్నారు. కారులో ఉన్న మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు.