Car Accident In Anantapur: ఏపీలోని అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం దొనేకల్ వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మార్గంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిపై నుంచి ఓ కారు చెరువులోకి దూసుకెళ్లింది. దాదాపు 30 నుంచి 40 అడుగుల లోతులో కారు పడిపోయింది. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్టు సమాచారం.
Car Accident In Anantapur: ఘోర ప్రమాదం.. కాలువలోకి దూసుకెళ్లిన కారు - car accident near donekal highway
20:16 December 29
Car Accident In Anantapur: ఘోర ప్రమాదం.. కాలువలోకి దూసుకెళ్లిన కారు
విషయం తెలుసుకున్న గుంతకల్ డీఎస్పీ నర్సింగప్ప, విడపనకల్లు ఎస్సై గోపాలుడు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు, క్రేన్‌సాయంతో కారును బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
దొనేకల్, కడగరబింకి గ్రామస్తులు సైతం భారీగా తరలివచ్చి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అయితే.. రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. కాగా.. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.