Car Accident at Panchalingala: ఏపీలోని కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిపై కారు వేగంగా దూసుకెళ్లింది. ఉదయం వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా... హైదరాబాద్ నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు. చెక్ పోస్ట్‌లో ఉన్న సిబ్బందిని, బారికేడ్లను ఢీకొట్టుకుంటూ కారు నిలిచిపోయింది. ప్రమాదానికి కారణమైన కారు కర్నూలుకు చెందిన యశ్వంత్ యాదవ్‌దిగా గుర్తించారు. యశ్వంత్ యాదవ్ మద్యం సేవించి కారు నడపడమే గాక... కారులో మద్యం తరలిస్తున్నట్లు సీఐ మంజుల తెలిపారు.
మద్యం తరలిస్తూ పోలీసులపైకి దూసుకెళ్లిన కారు.. - ఏపీ నేర వార్తలు
Car Accident at Panchalingala : ఏపీలోని కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిపైకి మద్యం తరలిస్తున్న కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ కాలు విరిగడంతో పాటు మరో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సీసీ టీవీలో నమోదైన ప్రమాద దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Car Accident
ఈ ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరావు కాలు విరిగిందని పేర్కొన్నారు. మరో పోలీసుకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. వీరిని కర్నూలు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సీసీ టీవీలో నమోదైన ప్రమాద దృశ్యాలు ఆధారంగా... కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని అడిషనల్ ఎస్పీ తుహిన్ సిన్హా పరామర్శించారు.
ఇదీ చూడండి :బస్సును వెనుక నుంచి ఢీకొట్టిన మరో బస్సు.. 50 మందికి గాయాలు