కుటుంబ సభ్యులంతా కలిసి సంతోషంగా శుభకార్యానికి వెళ్లొస్తున్నారు. అంతలోని విధి వారిని వక్రించింది. ఒక్కసారిగా కారు అదుపుతప్పి వాగులో పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలానికి చెందిన ఆరుగురు కుటుంబ సభ్యులు కారులో ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలానికి బంధువుల పెళ్లికి సోమవారం వెళ్లారు. రాత్రి వేళలో తిరిగి వారి ఇంటికి బయల్దేరారు. ఉట్నూర్ మండలం నాగపూర్ సమీపంలోని బ్రిడ్జి వద్ద కారు అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న మహిళ మృతి చెందగా మరో ఐదుగురు తీవ్ర గాయాల పాలయ్యారు.