అతివేగంగా కారు నడుపుతూ చెట్టును ఢీ కొనడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్ల వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామానికి చెందిన ఆలకుంట్ల చంటి హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా జీవనం గడుపుతున్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా తొర్రురుకు చెందిన సునీల్, అనిల్‌లతో వెలిశాలకు వెళుతున్న క్రమంలో... పాటిమట్ల కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టింది.
అతివేగం: చెట్టును ఢీ కొట్టిన కారు, నలుగురికి గాయాలు - పాటిమట్ల వద్ద కారు ప్రమాదం
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్ల వద్ద కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వెళ్లి చెట్టును ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారు బెలూన్‌లు తెరుచుకోవటం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
పాటిమట్ల వద్ద కారు ప్రమాదం
ప్రమాద సమయంలో కారు బెలూన్‌లు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రైవేటు అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి:వివాహేతర సంబంధమే కారణమైంది.. అడ్డొచ్చాడని హతమార్చింది!