అతివేగంతో వచ్చిన కారు డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టిన ఘటన రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జల్‌పల్లి గేట్ సమీపంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద ముందు వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేసిన మరో కారు అదుపుతప్పి డివైడర్ పైకి ఎక్కి అవతలి రోడ్డుపై బోల్తా పడింది. వెంటనే స్పందించిన స్థానికులు కారు నడుపుతున్న రహీం అనే వ్యక్తిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.
Accident: డివైడర్ పైకి దూసుకెళ్లిన కారు .. తప్పిన ప్రాణాపాయం - రోడ్డు ప్రమాదం
అతివేగమే ప్రమాదానికి కారణమైంది. డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా.. డ్రైవర్ను స్థానికులు రక్షించారు. రంగారెడ్డి జిల్లా జల్‌పల్లి గేట్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద ఈ ఘటన జరిగింది.
![Accident: డివైడర్ పైకి దూసుకెళ్లిన కారు .. తప్పిన ప్రాణాపాయం car accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11939943-182-11939943-1622267320421.jpg)
డివైడర్ పైకి దూసుకెళ్లిన కారు
డివైడర్‌ను ఢీకొట్టిన కారు
ఘటనా సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదంలో కారు మెుత్తం నుజ్జునుజ్జయ్యింది. కేసు నమోదు చేసుకున్న బాలపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి దృశ్యాలు స్థానిక సీసీటీవీల్లో రికార్డయ్యాయి.
ఇదీ చూడండి: Dharani portal: రిజిస్ట్రేషన్లతో తప్పని తిప్పలు.. అందని పాసుపుస్తకాలు
Last Updated : May 29, 2021, 11:22 AM IST