తెలంగాణ

telangana

ETV Bharat / crime

Gadipeddapur accident: కార్మికుల నివాసాల్లోకి దూసుకెళ్లిన కారు... ఒకరు మృతి - అల్లాదుర్గం వద్ద రోడ్డు ప్రమాదం

Alladurgam car accident: కారు అదుపు తప్పి కార్మికుల నివాసాల్లోకి దూసుకెళ్లిన ఘటన మెదక్​ జిల్లా అల్లాదుర్గం మండలంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Gadipeddapur accident
Gadipeddapur accident

By

Published : Dec 11, 2021, 12:31 AM IST

Accident at Gadipeddapur: మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దపూర్ వద్ద గల 161వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి కార్మికుల నివాసాల్లోకి వెళ్లగా ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

హైదరాబాద్​కు చెందిన రమేశ్​ చౌదరి అనే వ్యక్తి తన కారులో అతని స్నేహితులతో కలిసి నారాయణఖేడ్​లో జరిగిన వివాహానికి హాజరయ్యారు. తిరిగి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో గడిపెద్దాపూర్ గ్రామ శివారులో కారు అదుపుతప్పి... రోడ్డు పక్కనే స్వస్తిక్ క్యాంప్ కార్మికుల నివాసాల్లోకి దూసుకెళ్లింది. దీంతో రుద్రారం గ్రామానికి చెందిన మహేందర్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు.

కారులో ప్రయాణిస్తున్న శ్రీకాంత్, రమేశ్​ చౌదరి, రాజేశ్​ చౌదరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని సమీపంలోని జోగిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరు హైదరాబాద్​కు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు... ప్రమాదానికి అతివేగమే కారణమని భావిస్తున్నారు.

ఇదీ చదవండి:Thief Caught At Nunna: తప్పించుకోబోయి చెరువులో దూకిన దొంగ.. చివరికి..

ABOUT THE AUTHOR

...view details