ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో గంజాయిని పట్టుకున్నారు. నార్నూర్ మండలానికి చెందిన ఇద్దరు యువకులు ఆరు కిలోల గంజాయిని సంచిలో తీసుకొని హైదరాబాద్ తరలించేందుకు యత్నించారు. పోలీసులకు సమాచారం రావడంతో ఉట్నూర్ ఎస్సై బస్టాండ్కి చేరుకున్నారు.
గంజాయి తరలించేందుకు యత్నం... ఇద్దరు యువకులు అరెస్ట్ - గంజాయి
హైదరాబాద్కు గంజాయి తరలించేందుకు యత్నించిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఉట్నూర్ మండలంలో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై సుబ్బారావు తెలిపారు.
గంజాయి తరలించేందుకు యత్నం... ఇద్దరు యువకులు అరెస్ట్
గంజాయి తరలిస్తున్న ఇద్దరు బస్సు ఎక్కేందుకు ప్రయత్నించారు. గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుబ్బారావు తెలిపారు.
ఇదీ చూడండి:బడిలో తోటి విద్యార్థిపై మైనర్ కాల్పులు