ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతిభవన్ వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పీఈటీ పోస్టులను భర్తీ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తూ ప్రగతి భవన్ ముట్టడించారు. గత ఐదేళ్లుగా పోస్టులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భార్యా పిల్లలతో నరకయాతన అనుభవిస్తున్నామని అభ్యర్థులు వాపోయారు.
ప్రగతి భవన్ ముట్టడి.. పీఈటీ పోస్టుల భర్తీకి డిమాండ్ - Hyderabad District Latest News
గురుకుల పీఈటీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ పీఈటీ అభ్యర్థులు సీఎం అధికారిక నివాసం ప్రగతిభవన్ ముట్టడికి యత్నించారు. ప్రగతిభవన్ సమీపంలో అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేశారు. గత ఐదు సంవత్సరాలుగా పీఈటీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయలేదని అభ్యర్థులు అవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.
ప్రగతి భవన్ ముట్టడి
ప్రగతిభవన్ సమీపంలోని పోలీసులు పీఈటీ అభ్యర్థులను అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఎం కేసీఆర్ వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఆరెస్టు చేసిన అభ్యర్థులను పోలీసులు గోషామహల్ స్టేడియానికి తరలించారు.